కొవ్వూరు : కొవ్వూరు లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల
నేతలతో హోం మంత్రి డా.తానేటి వనిత గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి ఎమ్మెల్సీ బరిలో ఉన్న
వైస్సార్సీపీ అభ్యర్థులు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు
పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నియోజకవర్గ పరిశీలకులు
రాజీవ్ కృష్ణ, ఇతర సీనియర్ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి
పశ్చిమగోదావరి జిల్లా నుండి వైస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న వంకా
రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్ లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయాన్ని
అందించాలని హోంమంత్రి తానేటి వనిత సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి
ఈ నెల 13న పోలింగ్ ఉంటుందని, వైస్సార్సీపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు
వేసి గెలిపించాలన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఒకరికే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేసే
అవకాశం ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ క్రమంలో ఓటింగ్ లో
పాల్గొనే జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటింగ్
విధానంపై అవగాహన కల్పించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు
లభిస్తుందనడానికి వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ ఉదాహరణ అన్నారు.
వీరిద్దరూ ఆరంభం నుంచీ పార్టీ అభివృద్ధికి అహర్నిశలూ కృషిచేశారని హోంమంత్రి
గుర్తు చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న కౌరు
శ్రీనివాస్ గతంలో ఆచంట నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గా పని చేశారన్నారని
హోంమంత్రి వనిత గుర్తు చేశారు. అలాగే వంకా రవీంద్రనాథ్ 2014 ఎన్నికల్లో
నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేయడమే కాక, పార్టీ ప్లీనరీ
సమావేశాల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిశీలనకునిగా పనిచేశారన్నారు.
వీరిద్దరూ చేసిన సేవలకు గుర్తింపు గానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించారని హోం మంత్రి డా.తానేటి వనిత
పేర్కొన్నారు.