గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
ఐపీఎల్‌కు కూడా దూరమైనట్టు తెలుస్తోంది. వెన్నుకు సర్జరీ కారణంగా గతేడాది
సెప్టెంబరు నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో
కోలుకోకపోవడంతో మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్(IPL)కు కూడా దూరమైనట్టు
సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐపీఎల్ మొత్తానికి బుమ్రా
దూరమవుతున్నాడన్న వార్త రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు పెద్ద
ఎదురుదెబ్బే. ఐపీఎల్‌కు మాత్రమే కాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)
ఫైనల్‌కు చేరుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత జట్టుకు కూడా ఇది నిరాశ
కలిగించే వార్తే. జూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా బుమ్రా
అందుబాటులో ఉండే అవకాశం లేదు. వెన్ను నొప్పితో గతేడాది ఆసియాకప్‌కు
దూరమైనప్పటి నుంచి పునరాగమనం కోసం బుమ్రా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గాయం
తొలుత అంత పెద్దగా అనిపించకపోవడంతో టీ20 ప్రపంచకప్ జట్టుకి ఎంపికయ్యాడు.
గతేడాది సెప్టెంబరు 23, 25తేదీల్లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20
మ్యాచుల్లో ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆడలేకపోయాడు.
దీంతో స్కానింగ్ చేయించగా వెన్నుకు తీవ్ర గాయమైందని తేలింది. దీంతో బుమ్రాను
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పునరావాసానికి పంపారు. ఫలితంగా టీ20
ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.