అదితి.. సిద్ధార్థ.. స్టెప్పులతో ఇన్ స్టాలో హంగామా
హీరోయిన్ అదితీరావు, హైదరి హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని గత కొద్ది
రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ మహాసముద్రం అనే
సినిమాలో కలిసి నటించడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా
మారిందని, వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
కానీ, దీని గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. అయితే, ఈ
మధ్యకాలంలో పలు ఫంక్షన్లకు కలిసి వెళుతూ ఉండడంతో దాదాపు వీరిద్దరూ ఇక పెళ్లి
చేసుకోవడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ సంగతి అలా ఉంచితే
తాజాగా అదితీ రావు సిద్ధార్థ్ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని తన సోషల్
మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా ట్రెండింగ్ లో
ఉన్న ఒక పాటకు ఈ ఇద్దరు కలిసి డ్యా న్స్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్
మీడియాలో వైరల్ అవుతోంది.