హైదరాబాద్ : అమ్మాయిలు ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని, తమకు ఎదురయ్యే
సవాళ్లను అధిగమించి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని రాష్ట్ర మంత్రి
వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని,
ర్యాగింగ్, వేధింపులకు పాల్పడేవారిలో దడ పుట్టించాలన్నారు. మెదక్ జిల్లా
సిద్దిపేటలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచి స్వర్ణపతకం
సాధించిన గురుకుల విద్యార్థిని నామ నితన్యసిరిని తన కార్యాలయంలో సత్కరించారు.
ఆమెను అభినందించారు. కరాటేలో చిన్న వయస్సులోనే రాణించడం అభినందనీయమన్నారు.
మరింత ఉన్నతస్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అమ్మాయిలకు బాక్సింగ్, కరాటే వంటి ఆత్మరక్షణ, సాహస క్రీడలు
స్ఫూర్తినిస్తాయన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ
ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ పాల్గొన్నారు.