వెలగపూడి : ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం
కానున్నాయి. మార్చి 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం
ఉంది. 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై
చర్చించడంతోపాటు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో
విశాఖపట్నంలో జి-20 సదస్సులు జరగనున్న నేపథ్యంలో అంతకుముందే అంటే 25 లేదా 27న
బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. మధ్యలో 22న ఉగాది సందర్భంగా ఆ ఒక్క రోజు
లేదా రెండు రోజుల పాటు సెలవు ఇవ్వనున్నారు. విశాఖపట్నంకి తాను, తన కార్యాలయం
తరలి వెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని
వైకాపా వర్గాలు చెబుతున్నాయి.