అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డువరుసగా 5 వ సారి అవార్డు దక్కించుకున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి
ఫిబ్రవరి 24న కొచ్చిలో అవార్డు అందుకున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఏ)
కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్(ఐ.టి) శ్రీనివాస రావు
ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు గానూ అవార్డు సొంతం
ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ప్రశంసలు
విజయవాడ : జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారు నిర్వహించిన “డిజిటల్
టెక్నాలజి” పోటీలలో వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి
అవార్డు సాధించింది. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రయాణికులకు
ఉత్తమమైన సేవలు అందించడంలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఎప్పుడూ ముందుంటుంది. దానిలో
భాగంగా ఇటీవల కాగిత రహిత సేవలు ప్రవేశపెట్టింది. (యూనిఫైడ్ టిక్కెటింగ్
సొల్యూషన్) ద్వారా డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని కల్పించింది. ఇందుకుగానూ
2023 సంవత్సరానికి “ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్” విభాగములో వరుసగా 5వసారి
“డిజిటల్ టెక్నాలజి సభ” అవార్డుకు ఎంపిక అయ్యింది.
“యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్లను సులభంగా జారీ
చేసే సౌలభ్యాన్ని ప్రయాణికులకు కల్పించి ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రశంసలు అందుకుంది. 24-02-2023 తేదీన కొచ్చిలో జరిగిన
అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమములో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు (అడ్మిన్)
ఏ. కోటేశ్వర రావు, డిప్యూటీ ఛీఫ్ ఇంజనీర్(ఐ.టి) వై. శ్రీనివాసరావు కలిసి
సంస్థ తరపున ఈ అవార్డును అందుకున్నారు. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి వరుసగా ఈ అవార్డు
గెలుచుకోవడం పట్ల వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.