యాదగిరిగుట్ట : యాదాద్రి క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అలంకార
తిరువీధి సేవోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువజామున గర్భాలయంలో మూలవరులకు ప్రత్యేక
అభిషేకం, అర్చనలు నిర్వహించారు. వేంచేపు మండపంలో వటపత్ర శయన సేవ ప్రత్యేకతలను
ప్రధాన పూజారి వివరించారు. అష్టభుజి మండపంలో హారతి ఇచ్చిన అనంతరం తిరువీధుల్లో
ఊరేగించారు. సాయంత్రం వైటీడీఏ సౌజన్యంతో ఆలేఖ్య బృందం కూచిపూడి నృత్య
ప్రదర్శన, టీటీడీ అన్నమాచార్య కీర్తనల కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ
సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ యాదాద్రీశుల ఆశీస్సులతో తెలంగాణ
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామి తిరుకల్యాణ మహోత్సవంలో
భక్తులు అధికంగా పాల్గొని లక్ష్మీనారసింహ స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.
గవర్నర్కు భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత, ధర్మకర్త
నరసింహమూర్తి స్వాగతం పలికారు.