● ఆయన్ను ఎప్పటికీ మరువను..!
● రాజకీయంగా గుర్తించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా..!
● స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సానెపల్లి మంగమ్మ..!
● దేశమంతా కీర్తింపబడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి – ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన తనను చాలామంది అక్కా…మీరు ఎందుకు
బయటకు రాలేదని అడిగేవారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్వారా మళ్లీ నేను బయటకు
వచ్చాను. ప్రకాష్‌రెడ్డి ఆరోజు నన్ను ముందుకు తీసుకొచ్చాడు అని స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ అభ్యర్థి సానెపల్లి మంగమ్మ తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆమె
విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అండగా నిలవాలంటూ
వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఆరోజు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి సూచించగా
ఆయన నేనుంటానంటూ భరోసా ఇచ్చాడు. నాకున్న ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో
తిరగలేకపోయా. మళ్లీ ఈరోజు మా కుటుంబాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీగా అవకాశం
కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డికి ధన్యవాదాలు. నామీద ఉంచిన
నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తాన ని
మంగమ్మ తెలిపారు.
దేశమంతా కీర్తింపబడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి – ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో
చూపిస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈరోజు దేశమంతా
ఆయన కీర్తింపబడుతున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులగా ఉన్న
రాష్ట్రాల్లోకూడా లేని విధంగా ఎమ్మెల్సీల్లో దాదాపు 65 శాతం, మంత్రివర్గంలో 80
శాతానికి పైగా, స్థానిక సంస్థల్లో 70 శాతానికి పైగా
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పదవులు కల్పిస్తూ చట్టసభల్లో వచ్చే అవకాశం
కల్పించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్‌బోన్ క్లాసెస్
అంటూ నిరూపించారు.