పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న బాలీవుడ్ నటి
మాన్వి గాగ్రూ,కమెడియన్ కుమార్ వరుణ్బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ కమెడియన్ కుమార్ వరుణ్‌ను పెళ్లాడింది. జనవరిలో
నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఇందుకు సంబంధించిన
ఫోటోలను నూతన వధూవరులిద్దరూ గురువారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో
పంచుకున్నారు. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది.
‘ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది.
ఫిబ్రవరి 23న వివాహబంధంతో మేము ఒక్కటయ్యాం. దీన్ని అధికారికంగా
ప్రకటిస్తున్నాం. ఇప్పటివరకు మా ఇద్దరినీ ఆదరించారు. మా ప్రయాణంలో ఇకపై కూడా
మీ ఆదరణ కొనసాగాలని కోరుతున్నాం’ అనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్ చేశారు.
మాన్వి ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా.. వరుణ్ తెలుపురంగు వస్త్రాలు ధరించి
తలకు పాగా ధరించాడు. వివాహ రిజిస్ట్రేషన్‌లో భాగంగా రిజిస్టర్‌పై సంతకం
చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. కెమెరాల కోసం ఈ జంట తమ పెద్ద
చిరునవ్వులను చిందించారు. పరిపూర్ణ కుటుంబ ఫోటో కోసం వారి తల్లిదండ్రులు కూడా
చేరారు. పార్టీకి జకీర్ ఖాన్ కూడా వచ్చారు.