విజయవాడ : ప్రభుత్వంపై పనిగట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తన్న ఈనాడు
రామోజీరావుకి.. ప్రభుత్వం చేస్తున్న మంచి కనిపించడం లేదా అని ప్రశ్నించారు
మంత్రి జోగి రమేష్. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఏనాడైనా ఈనాడులో రాశావా అని
మండిపడ్డారు మంత్రి. రామోజీరావు రాసే ప్రతివార్త విషపు రాత అని, రామోజీపై
ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనే విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. రామోజీ
ఇలాగే విషం చిమ్ముతూ వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి
వార్నింగ్ ఇచ్చారు. మీడియా తో మాట్లాడిన మంత్రి జోగి రమేష్ ‘రామోజీరావుకి
పిచ్చిపట్టింది . హైదరాబాద్లో నాలుగు గోడల మధ్య కూర్చొని సీఎంపై విషం
కక్కుతున్నాడు. హైదరాబాద్లో కూర్చున్న నీకు ఏపీలో అభివృద్ధి ఏం కనబడుతుంది.
నీ కులం వాళ్లే అధికారంలో ఉండాలా?, వేరే కులం వారికి రాజ్యాధికారం అవసరం
లేదా?, సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం నీ కళ్లకు కనిపించడం లేదా?, రామోజీపై
ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికైనా విషపు రాతలు మానుకోవాలి. ఇదే తరహాలో
భవిష్యత్లో వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.