మన్యం జిల్లా : ఆ ఆటోలో వాళ్లంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి బయలుదేరారు.
అప్పటివరకూ ఎంతో సందడిగా గడిపి. ఆటోలో బయలుదేరిన వారంతా పెళ్లికి సంబంధించిన
ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి అలా జరిగింది. ఇలా జరిగింది అని ఎంతో
సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో వారిని మృత్యువు కబళించింది. ఒక్కసారిగా
వాళ్లు ప్రయాణిస్తున్న ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. అసలు ఏం జరిగిందో
తెలుసుకునేలోపే నలుగురి ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక
ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జరిగింది. బంధువులకు సంబంధించి పెళ్లికి వెళ్లి వస్తుండగా కొమరాడ మండలం చోళపదం
వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కకడే మృతి చెందగా మరో
ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా
ఉంది. ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు
చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స
అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని అంటివలసకు చెందిన వారిగా
సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు