ఓ కోడి దాడి చేయడంతో మనిషి చనిపోయిన ఘటన ఐర్లాండ్‌లో జరిగింది.
జాప్సర్క్రాస్(67) అనే వ్యక్తి రక్తస్రావమై అనుమానాస్పద రీతిలో
మృతిచెందిన కేసులో ఇటీవల ఈ విషయం తెలిసింది. గతేడాది ఏప్రిల్ 28న అతని
పెంపు కోళ్లలో ఒకటి అతడి కాలి వెనుకభాగంపై దాడి చేసింది. తీవ్ర
రక్తస్రామవగా.. అదే సమయంలో అతడికి గుండెపోటు రావడంతో ప్రాణాలు
కోల్పోయాడు. గతంలోనూ ఆ కోడి తన కుమర్తెపై దాడి చేసిందని జాస్పర్ కుమార్తె
తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
జాస్పర్ క్రాస్ ఐర్లాండ్‌లో నివాసముండేవాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. ఆయన
అనుభవజ్ఞుడైన జంతు ప్రేమికుడు. అందులో భాగంగానే కోళ్లను పెంచుకునేవాడు.
గతేడాది ఏప్రిల్ 28న తన గార్డెన్లో బయటకు వెళ్లిన సమయంలో వెనుక నుంచి కోడి
దాడి చేసింది. దాంతో అతను తప్పించుకునేందుకు పక్కనే ఉన్న కాలువలోకి
దూసుకెళ్లాడు. అప్పటికే అతను కోడి ధాటికి లీటర్ల రక్తాన్ని కోల్పోయాడు.
చేతకాక నీరతంతో కిందే పడిపోయాడు. దాంతో అతను ఏకంగా ప్రాణాలకే
పోగొట్టుకున్నాడని ఐర్లాండ్‌లోని సౌత్ రోస్కామన్కు చెందిన ట్రైనీ
హెల్త్‌కేర్ అసిస్టెంట్ వర్జీనియా గినాన్(33) చెబుతోంది. పౌల్ట్రీని కలిగి
ఉన్న వారు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇతరులను హెచ్చరించాలనుకుంటోంది.
‘కోడి ప్రమాదకరమని మీరు అనుకోరు. కానీ అవీ ప్రదాకారులే కావచ్చు. క్రాస్‌పై
దాడి పూర్తిగా క్రూరమైనది. ఇది పెంపుడు కోళ్లను కలిగి ఉన్న కుటుంబాలకు పెద్ద
గుణపాఠమే. పిల్లలకు తగిన సూచనలు ఇవ్వాలి. ఇలా జరగడం చాలా అరుదే.
నమ్మశక్యం కానిదే. కానీ ఇలా కూడా జరుగుతుందని ఓ కోడి నిరూపించింది. మరియు
నమ్మశక్యం కానిది, కానీ ఇది జరగవచ్చు .. అని వివరించారు.
‘ఏది ఏమైనా.. గుర్రాల వంటి పెద్ద జంతువులు మాత్రమే ప్రమాదకరమని భావించే
వాళ్లం. కానీ ఇలా కోడి నుంచి ప్రాణం కోల్పోవడం దురదృష్టకరమే. ప్రజలంతా
జంతువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలి. ఏదైనా పక్షి.. జంతువు దూకుడు
కనబరిచిన వెంటనే వాటిని వదిలించుకోవాలి. నా కూతురిపై దాడి చేసిన వెంటనే ఆ
కోడిని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్నాను. కానీ మా నాన్న దానిని
ఉంచాలనుకున్నాడు. ఆయన కోరిక మేరకే వదిలివేశాను. జంతు ప్రేమికుడి కోరికను
తీర్చానన్న సంతోషం మిగిలింది ‘అని జాస్పర్ క్రాస్ వివరించింది.