మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. వర్షం
అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం
వెల్లడించారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన 156
పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ రెండు పరుగులకే
రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, గబీ లూయిస్,
కెప్టెన్ లారా డెలనీ ఇద్దరూ కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. అయితే
తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. అప్పటికి ఐర్లాండ్ రెండు
వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. గబీ లూయిస్ 32, లారా డెలనీ 17 పరుగులతో
క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత కూడా మ్యాచ్ కొనసాగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్
ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల
నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. దూకుడుగా
బ్యాటింగ్ చేస్తూ పరుగుల వేగాన్ని పెంచింది. 56 బంతుల్లోనే 9 ఫోర్లు, 3
సిక్సర్లతో 87 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత ఎవరూ
రాణించకపోవడంతో భారత జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. షెఫాలీ వర్మ
24, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13, రోడ్రిగ్స్ 19 పరుగులు చేశారు. ఐర్లాండ్
బౌలర్లలో లారా డెలనీ మూడు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రెండు వికెట్లు తీసుకున్నారు.