పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన విజయమ్మ
తమ కుటుంబానికి పులివెందుల ఎలాగో తన కూతురు షర్మిలకు పాలేరు అలాంటిదేనని వైఎస్
షర్మిల అన్నారు. ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరులో పర్యటించారు. ఈ సందర్భంగా
వైఎస్సార్టీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ విగ్రహానికి
పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వచ్చే
ఎన్నికల్లో తన బిడ్డ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించి, పాలేరును బహుమతిగా
ఇవ్వాలని కోరారు. పాలేరు ప్రజలకు షర్మిల జీవితాంతం సేవ చేస్తుందని చెప్పారు.
పాలేరు ప్రజలు తన భర్తకు, తమ కుటుంబానికి ఎప్పుడూ సన్నిహితంగా ఉన్నారని
అన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను మీరు, మేము అందరూ కలిసి సాధించుకుందామని
పిలుపునిచ్చారు.