విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక ను
తాడేపల్లి పూజిత కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర రెవిన్యూ జే.ఏ.సీ చైర్మన్ వి.ఎస్ దివాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో
నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ఎస్. దివాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 జిల్లాల
నుంచి సభ్యులు పాల్గొన్నారని ఆంధ్ర ప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయ సంఘం రాష్ట్ర
అధ్యక్షుడిగా జి.ధైర్యం (కడప), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కర్నూలుకు చెందిన
కే. సత్యరాజు, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా శ్రీకాకుళం కి చెందిన వై. అప్పలరాజు,
కోశాధికారిగా నెల్లూరుకి చెందిన జి.హజరత్, ఉపాధ్యక్షుడిగా గుంటూరు కి చెందిన
పి. ప్రభాకర్ రావు, కార్యవర్గ సభ్యులుగా డి.బిన అప్పారావు, పి. అచ్చమ్మ ,
డి.పేలేసు, పి.సుబ్బయ్య, బి. మినర, ఎన్నికయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం అనంతరం
నూతన కార్యవర్గంతో వి.ఎస్. దివాకర్ ,కాకర్ల వెంకటరామిరెడ్డి వారి వారి
సమస్యలను తెలుసుకొని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
అన్న మాట ప్రకారం నాలుగు వేల మంది వీ.ఆర్.ఏలకు వీ.ఆర్వోలుగా పదోన్నతి
కల్పించిందని అలాగే వీఆర్వోలకి సీనియర్ సహా యకులుగా పదోన్నతో కల్పించిందని
దానికి మేమంతా రుణపడి ఉంటామన్నారు. తదుపరి కార్యవర్గ సభ్యులు కార్యాచరణ
పత్రంలో ముఖ్య సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర ప్రభుత్వంతో సామరస్యం గా చర్చించి
సాధించే దిశగా అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు. ముఖ్యంగా డి ఎ పెండింగ్లో ఉన్నవి
మంజూరు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వన్ టైం సెటిల్మెంట్ గా పదోన్నతి కల్పించే
దిశగా ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ తో వేతనం పెంచాలనీ, నామినీలకు ఉద్యోగం
కల్పించాలనీ, ఇటువంటి ముఖ్య సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి సాధించ దిశగా
అడుగులు ముందుకు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ
సహాయకుల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.