అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. తాజాగా సోమవారం రాత్రి
మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన జరిగింది. ఆ దాడిలో సుమారు
అయిదు మందికి తీవ్ర గాయాలైనట్లు క్యాంపస్ పోలీసులు తెలిపారు. సోమవారం
రాత్రి జరిగిన ఘటనలో గాయపడ్డవారిని హాస్పిటల్లో చేర్పించినట్లు
పోలీసు ఆఫీసర్ క్రిస్ రోజ్మాన్ తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా
ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం.
వర్సిటీ క్యాంపస్లో ఉన్న బెర్కీ హాల్లో కాల్పులు జరిగనట్లు పోలీసులకు
రాత్రి సమాచారం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి
వెళ్లారు. అనేక మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మరో
బిల్డింగ్ వద్ద కూడా కాల్పుల శబ్ధాలు వినిపించాయి.