అమరావతి : ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించిన డొమెస్టిక్ రోడ్ షోలో
పాల్గొననున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ హాజరు కానున్నారు. వచ్చే
నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల
మైదానంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది. బెంగళూరు వేదికగా పలు
రంగాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఏరో స్పేస్ అండ్
డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్
వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్
లాజిస్టిక్ ఇన్ఫాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్, రెన్యువల్
ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, టెక్సటైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్
ఇన్నోవేష న్, ఐటీ అండ్ జీసీసీ వంటి రంగాలపై చర్చ జరగనుంది.