నమూనా బ్యాలెట్ లో కారు గుర్తును చూపిస్తూ ఓట్ల అభ్యర్థన
కెసిఆర్ నాయకత్వానికి జై జైలు పలుకుతున్న ప్రజలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంస్థాన్ నారాయణపురంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు, నమూనా బ్యాలెట్ ని తీసుకొని కారు గుర్తు ఎక్కడ ఉందో ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ అభ్యర్థి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ గారి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2000 రూ. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ లేని మునుగోడు, ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ద్వారా మునుగోడులో లక్షలాది ఉద్యోగాల కల్పన, పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర పథకాలతో పాటు అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని వివరించారు మంత్రి గంగుల. సంస్థాన్ నారాయణపురం ప్రజలు కార్యకర్తలు అడుగడుగున మంత్రి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు సీఎం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ ఉమాప్రేమ్చందర్ రెడ్డి, సర్పంచ్ శిక్టమెట్ట శ్రీహరి, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.