అభివృద్ధికి నిదర్శనమన్న ప్రధాని నరేంద్ర మోడీ
మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడితే అవి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాయని
ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకే గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం
మౌలిక సదుపాయలపై భారీగా పెట్టుబడులు పెడుతోందని అన్నారు. రాజస్థాన్‌లో
దేశంలోనే అతి పెద్ద జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవేలో తొలిదశలో నిర్మించిన రహదారిని
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో
సమర్థమైన, సమృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తున్నామని మోడీ తెలిపారు.
భారత్‌లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు
కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి
దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి తీసుకెళ్లేందుకు
ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంలో
భాగంగా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను వెనుకబడిన ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్నామని
చెప్పారు.