మిస్టర్ ఇండియా 2012 పోటీ విజేత అర్రీ దబాస్ హాలీవుడ్ తెరపై అలరించనున్నారు. 15 సంవత్సరాల మోడలింగ్ తర్వాత తాను నటనకు ఉపక్రమిస్తున్నందున ఇండీ షార్ట్ ఫిల్మ్‌ల కోసం లాస్ ఏంజెల్స్ ఆధారిత ప్రొడక్షన్ బ్యానర్‌తో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులను యుఎస్, కెనడా, జర్మనీలలో చిత్రీకరిస్తామన్నారు. అలాగె ప్రధాన ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళతామని వివిధ ప్రదర్శనలలో 22 దేశాలలో మోడలింగ్ చేసిన దబాస్ చెప్పారు. “ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్‌లలో పాత్రల కోసం తాను హాలీవుడ్‌లోని ఎల్.ఏ. ప్రొడక్షన్ హౌస్‌తో చర్చలు జరుపుతున్నాను” అని శనివారం సింగపూర్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ తర్వాత దబాస్ వెల్లడించారు.