జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు వచ్చిన ఓ మెయిల్ కలకలం రేపుతోంది. ముంబయిలో
ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. తాను
తాలిబన్ సభ్యుడినంటూ దానిలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది సైన్యం. ముంబయిలో
ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి జాతీయ దర్యాప్తు
సంస్థ(ఎన్ఐఏ)కు మెయిల్ చేశాడు. తాను తాలిబన్ సభ్యుడినంటూ దానిలో
పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ
అధికారులు ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులకు అందించారు. అనంతరం పోలీసులతో కలిసి
సంయుక్త దర్యాప్తు ప్రారంభించింది ఎన్ఐఏ. ఫోన్ చేసిన ఐపీ అడ్రస్ పాకిస్థాన్లో
గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన మహారాష్ట్ర
పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాలను అప్రమత్తం చేశారు.