హైదరాబాద్ : సినీ దిగ్గజం, కళా తపస్వి, ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ కాశీ
విశ్వనాథ్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి
సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు సంస్కృతి,
సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత, సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన
సినిమాలు అత్యంత ఉత్తమమైనవి అని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ సినిమాలతో
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్లిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
అనేక పురస్కారాలు పొంది తెలుగువారి గొప్పతనాన్ని దశదిశలా చాటింది అన్నారు. ఆయన
సినిమా రంగానికి చేసిన కృషికి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య,
10 ఫిల్మ్ ఫేర్, నంది వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వరించాయన్నారు.
ఆయన మరణం సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమకు, కళా రంగానికి తీరని లోటు
అన్నారు. సినిమా ఉన్నంత కాలం ఆయన జనంతో ఉంటారని, ఆయన తీసిన సినిమాలు ఈ
సమాజాన్ని ఎప్పటికీ చైతన్య పరుస్తునే ఉంటాయన్నారు. విశ్వనాథ్ శివైక్యం చెందడం
పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం
చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.