చిత్తూరు : కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడం తెలుగు చలనచిత్ర
పరిశ్రమకి తీరని లోటని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అన్నారు. అత్యద్భుత చిత్రాలని తెరకెక్కించి, తెలుగు చలనచిత్ర
పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్దర్శకుడు దివంగతులవడం చాలా బాధాకరం. కళా
తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి
కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.