కుప్పం : క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న బైరెడ్డిపల్లె మండలం
నెల్లిపట్లకి చెందిన నిరుపేద సుబ్రహ్మణ్యం రెడ్డికి వైద్యం చేయించుకునే
స్థోమత లేదు. తమ పరిస్థితిని అప్పటి మంత్రి అమర్ నాథ్‌రెడ్డి దృష్టికి
తీసుకెళ్లగా ఆయన అభయం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫారసుతో
సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. చంద్రబాబు రూపంలో మాకు
దేవుడు అండగా నిలిచాడని సంతోషించింది సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబం. అయితే
కొద్దిరోజులకే సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి చెందారు. మనిషి దక్కలేదని
విషాదంలో మునిగిపోయారు. అయితే అత్యంత ఖరీదైన వైద్యం కోసం ఎటువంటి
అప్పుచేయకుండా చంద్రబాబు మంజూరుచేసిన సొమ్ముతో ఆస్పత్రి బిల్లులు
చెల్లించగలిగామని సుబ్రహ్మణ్యం రెడ్డి తనయుడు రమేష్ రెడ్డి
చెప్పుకొచ్చారు. యువగళం పాదయాత్రలో తమ ఊరు వచ్చిన నారా లోకేష్‌ని
కలిసిన సుబ్రహ్మణ్యంరెడ్డి తనయుడు రమేష్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. మీ
మేలు జీవితంలో మర్చిపోలేము సర్.. జీవితాంతం మా కుటుంబం మొత్తం టీడీపీ జెండా
సర్ అంటూ కృతజ్ఞతాభి వందనాలు చేసి లోకేష్‌తో రమేష్ రెడ్డి ఫోటో దిగారు.