ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం
వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం
విజయవాడ : ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం ఆయన మీడియా
సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయన్నారు.
”ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు
చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి.
వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారు. 7 రంగాలకు
ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ని రూపొందించారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన
అంశాలను ప్రస్తావించలేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ
బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. పంప్ స్టోరేజ్
విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఏపీ రోల్ మోడల్‌గా ఈ రంగంలో ఉంది. దీనిపై
పాలసీ తేవాలని కోరామని, దానిని ప్రకటించారు. ఈ బడ్జెట్లో మన రాష్ట్రంలో
అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీలు,
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు నిర్మాణానికి
ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని మంత్రి
బుగ్గన అన్నారు.
కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయి
ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన సలహాలు,సూచనలను
పరిగణలోకి తీసుకున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పంప్ స్టోరేజ్
విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఈ రంగంలో ఏపీ రోల్ మోడల్‌గా ఉంది. దీనిపై
పాలసీ తేవాలని కోరాం. పాలసీని ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచాలన్న
ఏపీ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించి నిధులు పెంచారు. రాష్ట్రంలో అంతర్జాతీయ
తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఏపీ ప్రతిపాదనను
పరిగణించి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం
గర్వకారణం. ఈ బడ్జెట్లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని
నిర్ణయాలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్
పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగకరం. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల
అభివృద్ధికి బడ్జెట్ తోడ్పాటు. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని
ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి సంబంధించి
ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదు. రాష్ట్రానికి సంబంధించి ఎరువులలో రూ.50 వేల
కోట్లు కేటాయింపు తగ్గింది. సబ్సిడీకి సంబంధించి ఫుడ్‌లో రూ.97 వేలు తగ్గింది.
విద్యకు రూ.13 వేల కోట్లు, విద్యుత్ రూ.25 వేల కోట్లు పెంచారు. రోడ్లు రవాణాలో
పెరుగుదల నమోదైంది. గ్రామాల్లో పనికి ఆహార పథకం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు
తగ్గాయి. జల్ జీవన్ మిషన్‌లో రూ.15వేల కోట్లు పెంపు.