బోలు ఎముకల వ్యాధి నివారణ ఇలా..
ప్రస్తుత రోజుల్లో బోలు ఎముకల వ్యాధి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రపంచ
వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే
ఎముకల బలహీనతే బోలు ఎముకల వ్యాధి. ఎముకలు సాంద్రతను కోల్పోవడం వల్లే ఇలా
అవుతుంది. దీనివల్ల ఎముకలు చిన్న దెబ్బకు కూడా విరిగిపోతుంటాయి. మీ శరీరంలో
విటమిన్ డి లోపిస్తే కూడా బోలు ఎముకల వ్యాధితో పాటుగా ఇతర ఎముకల వ్యాధులు
వస్తాయంటున్నారు నిపుణులు. బోలు ఎముకల వ్యాధి మీ ఎముకలు బలహీనంగా, పెళుసుగా
మారడానికి కారణమవుతుంది.
ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం కాల్షియం. ఈ కాల్షియం మీ
శరీరంలో లోపిస్తేనే ఎముకలు బలహీనపడతాయి. అయితే ఈ కాల్షియం ను మన శరీరం
శోషించుకోవాలంటే విటమిన్ డి అవసరపడుతుంది. ఇందుకోసం పాలు, పెరుగు, జున్ను,
బీన్స్, సార్డినెస్, ఆకుకూరలు తప్పకుండా తినండి. వీటిలో కాల్షియం సమృద్ధిగా
ఉంటుంది. ఈ ఆహారాలు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఎముకల
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా ఉండాలి. అందుకోసం
తీసుకునే ఆహారంలో పాలతో పాటు ఇతర ఆహారాలు టర్నిప్ ఆకుకూరలు, ఆవాలు,
సోయాబీన్స్ ఉండాలి. కాల్షియం ఉన్న సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
“ఆస్టియోపోరోసిస్ ఒక ప్రధానమైన, సాధారణ ఆరోగ్య సమస్యగా కొనసాగుతోంది. ఎముకలు
కాల్షియంతో తయారవుతాయి. శరీరంలో 99 శాతం కాల్షియం నిల్వ చేయబదుతుంది. మిగిలిన
ఒక శాతం మాత్రమే రక్తం, కండరాలు, కణజాలాలలో నిల్వ చేయబడుతుంది.” అని వైద్య
నిపుణులు పేర్కొన్నారు.