ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని తొలుత నిర్ణయం
మార్చి 3,4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్
అది ముగిశాక మూడో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
వెలగపూడి : శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం
తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు
ప్రారంభించి 22 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది.
అయితే, ఇప్పుడు వీటిని మార్చికి జరిపినట్టు తెలుస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో
విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం
తీసుకున్నట్టు సమాచారం. మార్చి రెండో వారంలో సమావేశాలను మొదలుపెట్టి మూడోవారం
చివర్లో ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం.