పాదయాత్ర ఎందుకో చెప్పాలి
ఎవర్ని మభ్యపెట్టడానికి పాదయాత్ర?
వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టత ఇవ్వాలి?
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
శ్రీకాకుళం : నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని ఎమ్మెల్సీ దువ్వాడ
శ్రీనివాన్ అన్నారు. నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం
నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాదారు. ఎవరిని మోసం చేయడానికి
పాదయాత్ర ప్రారంభించారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం
ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనలాగే పాదయాత్ర చేసి
సీఎం కావాలనుకోవడం చంద్రబాబు, లోకేష్ లు పగటి కలలు కనడమేనని చెప్పారు. 3100
కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని గుర్తు
చేశారు. రాజధాని పేరుతో 33 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మీ
నాన్న చంద్రబాబు పన్నాగం. పన్నారన్నారు. ఐదేళ్లలో ఐదు కళ్యాణ మండపాలు మాత్రమే
నిర్మించి ఇదే రాజధాని నిర్మాణాలు అంటూ చెప్పిన ఘనత చంద్రబాబుకే
దక్కుతుందన్నారు. టిడిపికి దశా, దిశా లేదన్నారు. పాదయాత్ర చేయడానికి మీకున్న
అర్హత ఏంటి అని ప్రశ్నించారు. నువ్వు సీఎం అభ్యర్థినా.. మీ నాన్న దత్తపుత్రుడు
పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధా చంద్రబాబు నాయుడు అభ్యర్ధా.. అసలు ఎవరు
ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. ఐటీ
మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం వేసావా, ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా అంటూ
ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోలేక
గుంపులుగా జోడీలు కట్టి వస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా
సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజాభిమానం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. అసలు
టిడిపి 175 స్థానాల్లో పోటీ చేస్తుందా? ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కి 50
స్థానాలకి అవకాశం ఇస్తారా? అన్నది చెప్పాలన్నారు. 50 స్థానాల్లో జనసేనకు
అవకాశం ఇస్తే ఆ నియోజకవర్గంలోని టిడిపి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని అడిగారు.
మీరు అధికారంలో కాస్తే సచివాలయ, వాలంటర్ వ్యవస్థలను రద్దు చేస్తారా? అని
ప్రశ్నించారు. తాము అధికారంలోకొస్తే సంక్షేమ పథకాలను మరింత ముందుకు
తీసుకెళ్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కాంటే సంక్షేమ పథకాలు
బాగున్నాయని ఒప్పుకున్నట్టే కదా మరి నీ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు అని
విమర్శించారు. కేవలం టిడిపి ఉనికి చాటుకోవడానికే పాదయాత్ర ప్రారంభించారని
ప్రజలు ఇప్పటికే గ్రహించారని వివరించారు.
అచ్చెన్నాయుడు ఎక్కడ?.
తెలుగుదేశం పార్టీ లేదు..ఏమీ లేదు అంటూ నీచంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు
పాదయాత్ర ప్రారంభించడం హాస్యాస్పదంగా అందన్నారు. నాలుగేళ్లలో తిక్కలి
నియోజకవర్గ సమస్యలపై ఎంత మేర దృష్టి సారించారో అచ్చెన్నాయుడు చెప్పాలని
డిమాండ్ చేశారు. అసలు అచ్చెన్నాయుడు ఎక్కడున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్
ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చారిత్రాత్మకమైనదని తెలిపారు.
మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలను 98 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్
రెడ్డికే దక్కుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.