న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగనున్న టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ
షాక్ తగిలింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రాత్రి 7.30 గంటలకు టీ20
మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు
దూరమయ్యాడు. మణికట్టు గాయంతో న్యూజిలాండ్తో జరిగే టీ20 మ్యాచ్లకు దూరమైనట్లు
బీసీసీఐ గురువారం ప్రకటించింది. చికిత్స పొందేందుకు బెంగళూరులోని జాతీయ
క్రికెట్ అకాడమీలో ఆయనను చేర్చుకోవాలని బీసీసీఐ సూచించింది. ఇక, వన్డే సిరీస్
గెలుచుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ను కూడా గెలిచేందుకు రెండు జట్లు ఫోకస్
చేశాయి. అయితే ఇప్పటికే టీమిండియా యంగ్ ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్, సంజూ
శాంసన్ కూడా గాయాల కారణంగా టీ20 సిరీస్కు దూరం కాగా.. రుతురాజ్ గైక్వాడ్
కూడా దూరం కావడం భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అతని స్థానంలో పృథ్వీ షా,
రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ కు పంపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, భారత్
పర్యటనలో భాగంగా మూడు టీ20ల్లో హార్దిక్ పాండ్యా యువ జట్టుతో కివీస్
తలపడనుంది.