టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో దుమ్మురేపాడు. రంజీ
ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా..
తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం
చేశాడు. మోకాలి గాయం కారణంగా కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డూ..
రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే
సెలెక్టర్లు సైతం అతనికి రంజీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జడేజా
వచ్చీ రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా
తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే
తీశాడు.బ్యాటింగ్‌లోనూ కాస్త పర్వాలేదనిపించిన జడ్డూ (35 బంతుల్లో 22 నాటౌట్;
2 ఫోర్లు).. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు
తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133
పరుగులకే చాపచుట్టేసింది. జడేజాకు జతగా మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) 3
వికెట్లతో రాణించడంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన తమిళనాడు తక్కువ
స్కోర్‌కే కుప్పకూలింది. జడేజా చివరిసారిగా గతేడాది ఆగస్టులో జరిగిన ఆసియా
కప్‌లో భారత్ తరఫున ఆడాడు.