అమరావతి :74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వెలగపూడి లోని
రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ
జెండాను ఎగుర వేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాల
వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.1950 జనవరి
26న మన రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన శుభదినమని ఆనాటి నుండి ప్రతి యేటా
గణతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోందని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుందని
పేర్కొన్నారు. అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికీ అందాలని, ఆ
దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉద్యోగులుగా మనం ప్రజలందరికీ ఆ సంక్షేమ
ఫలాలు సక్రమంగా అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ డా.జవహర్ రెడ్డి
స్పష్టం చేశారు. ఇందుకు గాను ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగి మరింత చిత్తశుద్ది
అకింత భావాలతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలోని అన్ని
వర్గాల సంక్షేమానికి ఈప్రభుత్వం కట్టుబడి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
చేపట్టి అమలు చేస్తోందని వాటిని క్షేత్రస్థాయి వరకూ తీసుకువెళ్ళి అర్హులైన
ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. అనంతరం ఈకార్యక్రమంలో
పాల్గొన్న చిన్నారులు, ఉద్యోగులకు సిఎస్ డా.జవహర్ రెడ్డి మిఠాలు పంపిణీ
చేశారు. ఈకార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి,
సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య, శ్రీనివాస్,రాష్ట్ర సచివాలయ
ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంట్రామిరెడ్డి, పలువురు సచివాలయ అధికారులు,
ఉద్యోగులు,ఎస్ఫిఎఫ్ పోలీసు సిబ్బంది,ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.