కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అస్తవ్యస్తంగా మార్చేసింది. ఇలంటి మహమ్మారి
వ్యాధులను ఎదుర్కోవడానికి ఫార్మా కంపెనీలు, వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు
ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక వ్యాక్సిన్లు మార్కెట్ లోకి
అందుబాటులోకి వచ్చాయి. అయినా.. ఆ మహమ్మారిని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి
నూతన ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ
భారత్ బయోటెక్ మరో ఆవిష్కరణ చేసింది.
దేశంలో తొలి భారతీయ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంకోవాక్
(iNCOVACC)ను జనవరి 26న ఆవిష్కరించనున్నది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్
కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. భోపాల్‌లో
జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ ఈ వాక్సిన్ కు
సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అలాగే..పశువులలో లంపీ-ప్రోవింద్ అనే
దేశీయ వ్యాక్సిన్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలియజేశారు.
ఈ వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి
మాత్రమే తీసుకోవాలి.12 నుండి 17 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు
వేయబడుతున్నాయి, కానీ వారికి పూర్తి డోస్ ఇవ్వరు.రెండవ విషయం ఏమిటంటే.. ఇది
బూస్టర్ డోస్ గా పని చేస్తుంది. అంటే..రెండు డోస్‌లు తీసుకున్న వారు మాత్రమే ఈ
వ్యాక్సిన్‌ని పొందగలరు.