అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
షారూక్ ఖాన్ ఎవరో నాకు తెలియదని చెప్పిన కొద్దిగంటల్లోనే షారూక్ ఖాన్ సీఎంకు
ఫోన్ చేయడంతో సీఎం మొత్తపడ్డాడు. షారూక్ పఠాన్ సినిమాకు పూర్తి భద్రత
కల్పిస్తామని, అది ప్రభుత్వం బాధ్యత అంటూ ఆదివారం ఉదయం తన ట్విటర్ ఖాతాద్వారా
పేర్కొన్నారు. షారూక్ ఖాన్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పఠాన్
సినిమా 25న విడుదల కానుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
వ్యక్తమవుతున్న విషయం విధితమే.
గౌహతి థియేటర్లలో పఠాన్ పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ
క్రమంలో ఈనెల 21న స్థానిక విలేకరులు ఈ విషయాన్ని సీఎ హిమంతను ప్రశ్నించారు.
షారుఖ్ ఖాన్ ఎవరు?, అతడి గురించి, అతడి సినిమా పఠాన్ గురించి నాకేమీ తెలియదు
అంటూ శర్మ బదులిచ్చాడు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది తనకు ఫోన్ చేస్తుంటారని,
షారుక్ ఖాన్ మాట్లాడరని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రజలు అస్సామీ మినహా
హిందీ సినిమాల గురించి పట్టించుకోరని సీఎం వ్యాఖ్యానించాడు.
గౌహతిలో ఇటీవల పఠాన్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరిగాయి.
నిరసనపై ముఖ్యమంత్రిని వివరణ కోరగా, షారుఖ్ ఖాన్, పఠాన్ గురించి తనకు తెలియదని
అన్నారు. ఒక రోజు ముందు తనకు తెలియని షారుఖ్ ఖాన్‌కు ‘శ్రీ’ వందనం అని
స్పష్టం చేశాడు. అతను పేర్కొన్నట్లుగా, ‘శ్రీ’ అతని కార్యాలయ గౌరవాన్ని
ప్రతిబింబిస్తుందని అన్నారు. “నేను ఎవరినీ పిలవలేదు, కానీ నన్ను పిలిచి తనను
తాను పరిచయం చేసుకున్న నటుడే. శాంతిభద్రతలపై నా హామీ నా రాజ్యాంగ బాధ్యతను
మాత్రమే ప్రతిబింబిస్తుంది. దాని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు” అని అస్సాం
ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.