మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి బీ టౌన్లో పరిచయం
అక్కర్లేదు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణం సాగించింది.
అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. సుష్మితా సేన్
1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. హిందీ, తమిళ, తెలుగు
సినిమాల్లో నటించింది.
అయితే సుస్మితా సేన్ తాజాగా ఓ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు
చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు తానే
గిఫ్ట్ ఇచ్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన
ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా
వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళగా ఈ బహుమతి
ఇచ్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సుస్మితా సేన్ కొన్న కారు ధర
రూ.1.92 కోట్లుగా ఉంది.
ఆమె తన ఫొటో క్లిప్‌ను షేర్ చేస్తూ, సుస్మిత పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది,
” డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళ… తనకు తానుగా ఈ శక్తివంతమైన అందాన్ని బహుమతిగా
ఇస్తుంది” అంటూ రాశారు. ఆమె పోస్ట్‌పై చారు అసోపా స్పందిస్తూ, “వావ్ దీదీ,
కంగ్రాట్స్” అని వ్యాఖ్యానించారు. సుస్మిత సోదరుడు రాజీవ్ సేన్.. ఆమె
అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.