విశాఖపట్నం : ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి
గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి
పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా
తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి
ఉద్ఘాటించారు. విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని
వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో
అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం’’
అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు ఐటీ
ప్రతినిధులు పాల్గొన్నారు.