అమరావతి : విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు
చేయనున్న అంబేద్కర్ స్మృతివనం, అందులో ఏర్పాటు చేయనున్న భారీ విగ్రహ పనులపై
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష
నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ చేపట్టిన సివిల్ వర్క్స్,
సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే తదితర అంశాలపై ఆయన
అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ క్రమంలో పనుల తీరును సీఎం జగన్‌కు
అధికారులు వివరించగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. విగ్రహ పీఠంతో కలిపి
మొత్తంగా అంబేదర్క్ విగ్రహం 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు సీఎం
జగన్‌కు వివరించారు.అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు కాగా పీఠం
భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుంది. అలాగే ప్రాంగణంలో ఒక కన్వెన్షన్
సెంటర్ కూడా రానుంది. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112
మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ
నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు జనవరి 31 కల్లా విగ్రహానికి
సంబంధించి కాస్టింగ్ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు
జరిగాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలించామన్న అధికారులు
దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని
వెల్లడించారు. కార్ పార్కింగ్, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం
కేటాయించామని, అలాగే అంబేద్కర్ స్మృతి వనానికి దారితీసే రోడ్లను
సుందరీకరిస్తామని అధికారులు తెలిపారు. అధికారుల వివరణకు సీఎం జగన్
స్పందిస్తూ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో అస్సలు
తగ్గొద్దని, అలాగే నిర్మాణాలు అందంగా ఉండాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు
ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు
సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున,
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి,
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ
సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్
ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.