వెలగపూడి : దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్
నియామకంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను హైకోర్టు కలిపి గురువారం విచారణ
చేపట్టింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ నిష్ణాతులైన వారినే
సలహాదారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు
సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. మెరిట్స్‌పై వాదనలు
వినిపిస్తామని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. సలహాదారుల నియామకాలపై ఆగ్రహం
వ్యక్తం చేసిన హైకోర్టు ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా
అని ప్రశ్నించింది. అంతేకాకుండా సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని
హైకోర్టు వ్యాఖ్యనించింది.
కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు అధికారులకు జైలుశిక్ష విధించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి ఇద్దరు జిల్లా
పంచాయితీ అధికారులకు జైలు శిక్షను విధించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే
ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓ సర్పంచ్ చెక్ పవర్‌ను సస్పెండ్ చేసి,
ఈవో ఆర్డీ ద్వారా చెల్లింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో న్యాయస్థానం
సూమోటోగా కోర్టుధిక్కార కేసు నమోదు చేసింది. తాజాగా మరోమారు విచారణ చేపట్టి
తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టుధిక్కార కేసులో ఇద్దరు
జిల్లా పంచాయితీ అధికారులకు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా
డీపీఓగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం
రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానాను విధించింది. మరో కేసులో చిత్తూరు
జిల్లా పంచాయితీ అధికారి దశరధ రామిరెడ్డికి 15 రోజుల జైలు శిక్ష, రూ. 2 వేల
రూపాయలు జరిమానా విధించింది. అయితే, తీర్పు అమలును వారం రోజుల పాటు
నిలిపివేస్తూ అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది.
సింగవరం గ్రామంలో జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయ నిర్మాణంపై గతంలో
హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓగా
పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావు సర్పంచ్ చెక్ పవర్‌ను
సస్పెండ్ చేసి ఈవో ఆర్డీ ద్వారా చెల్లింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో
విచారించిన న్యాయస్థానం సూమోటోగా కోర్టుధిక్కార కేసుగా నమోదు చేసింది. ఈ
క్రమంలో నేడు మరోసారి విచారించిన ధర్మాసనం ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం
రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానాను విధించింది.
ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ : ప్రభుత్వానికి 4 వారాలు గడువు
ఫైనాన్స్ కమీషన్‌ను నియమించాలని కోరుతూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి
రెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో మూడు నెలల్లో
ఫైనాన్స్ కమీషన్ నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా మూడు నెలలు దాటుతున్నా
కమీషన్‌ను నియమించకపోవడంతో.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై
ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించి.. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా
వేసింది.