దేశం దృష్టికి తమవైపు తిప్పుకునేలా జరుగుతున్న భారాస సభకు పలువురు జాతీయ నేతలు
హాజరవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న వారికి ప్రగతిభవన్లో సీఎం
కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విందు సమయంలో జాతీయ
రాజకీయాలు, సంబంధిత జాతీయ అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన
భారత్ రాష్ట్ర సమితి సభకు ఖమ్మం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం అనంతరం
నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే
కేంద్రీకృతమైంది. దేశం దృష్టిని ఆకర్షించేలా జరుగుతున్న భారాస సభకు పలువురు
జాతీయ నేతలు హాజరవుతున్నారు. బహిరంగసభలో పాల్గొనేందుకు దిల్లీ, పంజాబ్, కేరళ
రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి
విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా,
పలువురు జాతీయ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో
ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఇవాళ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విందు
సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత జాతీయ అంశాలపై చర్చించారు. విందు అనంతరం
బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి బయలుదేరి వెళ్లారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతనం అక్కడినుంచి ఖమ్మం
వెళ్లనున్నారు.