ఫిబ్రవరి 23న విడుదల
కొంతకాలంగా మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్
కుమార్. ఈ స్టార్ హీరో రాజ్ మెహతా డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి
తెలిసిందే. సెల్ఫీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ మరో
లీడ్ రోల్ చేస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్
వెంజరమూడు కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు ఇది
హిందీ రీమేక్.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు
అక్షయ్ కుమార్. సెల్ఫీని ఫిబ్రవరి 23న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు
ప్రకటించింది అక్షయ్ అండ్ టీం. దియానా పెంటీ, నుస్రత్ భరూచా ఫీ మేల్ లీడ్
రోల్స్ లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, అక్షయ్ కుమార్
హోం బ్యానర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, సుకుమారన్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్,
మ్యాజిక్ ఫ్రేమ్స్ సెల్ఫీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో, అక్షయ్ కుమార్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “అభిమానులు
స్టార్‌ని చేస్తారు. అభిమానులు కూడా స్టార్‌ని విచ్ఛిన్నం చేయగలరు! అభిమాని తన
విగ్రహానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోండి. ఫిబ్రవరి
24న సినిమాల్లో #సెల్ఫీ చూడండి” అని క్యాప్షన్ ఇచ్చాడు.