‘బిచ్చగాడు’ సినిమాతో పాపులర్
అయిన హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. మలేషియాలో ఓ సినిమా షూటింగ్
సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఆ బోట్ సడన్ గా
కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్
ను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స
అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.