చిత్తూరు : సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, పిండివంటలు, కోడి పందేలు, ఆటపాటల
సందడి. ఇవి మాత్రమే గుర్తుకువస్తాయి. అయితే సంక్రాంతి అంటే కేవలం ఇవే కాదు.
పశువులను ఘనంగా పూజించడం కూడా. కనుమ నాడు పశువుల పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
గోపూజ అంటే తిరుపతి జిల్లా గుర్తుకొస్తుంది. తాజాగా ఎ.రంగంపేటలో పశువుల
పండుగను తిలకించేందుకు వచ్చిన వారిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలకరించారు.
సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికీ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు..తిరుపతి
జిల్లాలో పశువుల పండగ గుర్తుకొస్తాయి. రాయలసీమ ప్రాంతమైన తిరుపతి జిల్లాలోని
ఎ.రంగంపేటలో కనుమ రోజున పశువుల పండుగను వైభవంగా నిర్వహిస్తారు. పశువులను
అలంకరించి వాటి కొమ్ములకు వారి ఇష్ట దైవం పటాలు, ప్రముఖ హీరోల చెక్క పలకలను
కడతారు. అనంతరం పశువులను పురవీధుల్లో వదులుతారు. పటాలను, చెక్కపలకను
చేజిక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఈ క్రమంలో ఎవరైనా గాయపడితే అక్కడే
ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్యం అందిస్తారు. పోటీలను
తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే
ప్రేక్షకులకు నిర్వాహకులు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేస్తారు.