కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
కోల్కతా : భారత్లో ప్రధానమంత్రి పోస్టు ఖాళీగా లేదని, మోడీ నేతృత్వంలో
వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ పేర్కొన్నారు. పీఎం అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని సామర్థ్యాలు
ఉన్నాయంటూ అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.
ప్రధానమంత్రి అయ్యేందుకు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అన్ని సామర్థ్యాలు
ఉన్నాయంటూ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం
తెలిసిందే.
ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
సాధిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని, ఈసారి కూడా ప్రజలు మోడీ వైపే
ఉన్నారని అన్నారు. కోల్కతా శివారులో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో
మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్ ఈ విధంగా స్పందించారు. ‘భారత్లో ప్రధానమంత్రి
పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ పై వరుసగా రెండుసార్లు
విశ్వాసాన్ని నిరూపించారు. ఈసారి కూడా ప్రజలు మోడీ వైపే ఉన్నారనే నమ్మకం
ఉంది. పేద, మహిళలు, యువత, వెనకబడిన, గ్రామీణ ప్రజలు దేశాన్ని నడిపించే
బాధ్యతను మోడీ పై ఉంచారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో
ఎన్డీఏ విజయం సాధిస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు’ అని పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు (2024) పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటాయని
భావించడం పొరబాటేనని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల పేర్కొన్నారు. రానున్న
ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడిన ఆయన
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం
ఉందని వెల్లడించారు. ఆర్థికవేత్త చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి
ఈవిధంగా మాట్లాడారు.