గుంటూరు : తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంబరాలు
జరిగాయి. సీఎం దంపతులకు పూర్ణకుంభతో అర్చకులు స్వాగతం పలికారు. గోశాలలోని
గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల
విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి
నృత్యాలతో వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన,
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు, అవ్వాతాతలందరికీ
కూడా ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు
ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ అన్నారు. ప్రభుత్వ
విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్,
టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్
సామినేని ఉదయభాను పాల్గొన్నారు.