నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో సంక్రాంతి
సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ లావు
నాగేశ్వరరావు, త్రిభాషా సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్, మంత్రి కాకాణి
గోవర్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి హాజరయ్యారు. పలువురు
విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మాట్లాడుతూ 2023 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితం
కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ అవసరం అన్నారు. మన పూర్వీకులు
చూపించిన మార్గంలో నడవండి. ఉత్సహంగా ఉల్లాసంగా ఉండండి. సంస్కృతి సంప్రదాయాలను
పాటించండి అని కోరారు. ఆటలు, పాటలు, గాలి పటాలు , రైతుల పండుగ, పశువులు,
పెద్దలను పూజించే పండుగ సంతోషాలతో ఉండటమే సంక్రాంతి అని అన్నారు.