వాల్తేరు వీరయ్య నటీనటులు : చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్,
రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల
కిషోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్, ప్రదీప్ రావత్ తదితరులు,
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:
నిరంజన్ దేవరమన్నె, నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్; స్క్రీన్‌ప్లే:
కోన వెంకట్, కె.చక్రవర్తి, కథ, దర్శకత్వం : కె.ఎస్.రవీంద్ర. విడుదల:
13-01-2023
హైదరాబాద్ : సంక్రాంతి పండగకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు
వెళ్లి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుడి
సినిమా అయితే, ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆచార్య’ ఆశించిన విజయం
సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’పైనే ఉన్నాయి. యువ
దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై
అంచనాలను పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘వాల్తేరు
వీరయ్య’గా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో ఏ మేరకు మెప్పించారు?
ద్వితీయార్ధంలోనే అసలు కథంతా. విక్రమ్ సాగర్‌గా రవితేజ ఎంట్రీ.
వీరయ్యతో వైరం ఆ నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పోలీస్ పాత్రలో
రవితేజ ఉంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఇందులోనూ కనిపించింది. అయితే వీరయ్య,
విక్రమ్ సాగర్ మధ్య బంధం నేపథ్యంలో భావోద్వేగాలు బలంగా పండించే అవకాశం
ఉన్నా, ఆ దిశగా చేసిన కసరత్తులు చాలలేదనిపిస్తుంది. చిరంజీవి, రవితేజ
వాళ్ల పాత సినిమాల్లోని ఒకరి డైలాగుల్ని మరొకరు చెప్పడం, పూనకాలు లోడింగ్
పాటలో కలిసి చేసిన డ్యాన్సులు మాత్రం అభిమానుల్ని అలరిస్తాయి. జారు మిఠాయ
పాటనీ, చేసే మూడు ఉత్సాహం వంటి ప్రాచుర్యం పొందిన మాటల్ని ఇందులో చిరంజీవి
వాడిన విధానం నవ్విస్తుంది. వింటేజ్ చిరంజీవి కనిపించినా, అభిమానుల్ని
మెప్పించే అంశాలున్నా, రవితేజ సందడి చేసినా కథ, కథనాల పరంగా ఇంకాస్త
జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. రిస్క్ జోలికి పోకుండా,
చిరు అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పాత కథని అంతే పాత పద్ధతుల్లో
చెప్పాడు దర్శకుడు.