గుంటూరు : తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసి జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను ఆయన పూర్తిచేశారు. అనంతరం సీఎం జగన్‌తో సోమేశ్‌కుమార్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను కొట్టేసి సోమేశ్‌కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు
జారీచేసింది. ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. తనకు అప్పగించే బాధ్యతల్లో కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సోమేశ్‌కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారిని నియమించిన విషయం తెలిసిందే.