అమరావతి : నాటు నాటు సాంగ్తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. తెలుగు
జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున కీరవాణి, రాజమౌళి,
జూ.ఎన్టీఆర్, రామ్చరణ్ మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు అభినందలు
తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్
చేశారాయన. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డును
దక్కించుకోవడంతో ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది.