కడప : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జన సంక్షేమమే ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గడపకు వెళ్లి సూర్యుడు ఉదయించకనే తలుపు తట్టి పెన్షన్ అందించడం జరుగుతోందని మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆశీర్వాదాలు, దీవెనలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ భాష అన్నారు. స్థానిక వైయస్సార్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ భాష అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాలు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని, వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమ్మఓడి, డ్వాక్రా రుణమాఫీ, చేయూత పథకాల ద్వారా పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్పారు.
అనంతరం సీనియర్ నాయకులు అఫ్జల్ ఖాన్, నగర డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యాదయ్య, కార్పొరేటర్లు సూర్యనారాయణ, అక్బర్ అలీ, పాకా సురేష్, బండి ప్రసాద్, నాగేంద్ర, బసవరాజు లు వైయస్సార్ పెన్షన్ కానుక పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, బాల స్వామి రెడ్డి, షంషీర్, ఇతర కార్పొరేటర్లు, వైకాపా నాయకులు ఆర్ఎన్ఐ తోట కృష్ణ, జమాల్ వల్లి, నాయకురాలు టీవీ సుబ్బమ్మ, ఇతరులు పాల్గొన్నారు.