ఏలూరు : రాష్ట్రంలోని ప్రతి అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ, మహిళా
సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని
రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి
అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసే
లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ
కార్యక్రమంలో సైతం ఇంటి పట్టాను మహిళల పేరు మీద అందించి వారికి తోబుట్టువ గా
నిలుస్తూ సగర్వంగా గౌరవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆళ్ల నాని
అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 70వరోజు పాదయాత్రలో భాగంగా
సోమవారం మధ్యాహ్నం గం.3.30 నుంచి ఏలూరు కార్పొరేషన్ 21వ డివిజన్ 38వ సచివాలయాల
పరిధిలోని శాంతినగర్ ప్రాంతాల్లో ఆళ్ల నాని పర్యటించారు. స్థానిక 21వ డివిజన్
కార్పొరేటర్ అన్నపనేని భారతి దేవి, వైఎస్సార్ సిపి నాయకులు అన్నపనేని రవి
ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, మహిళలు ఆళ్ల నాని
కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.భారీ గజమాలలు, మహిళల మంగళ హారతులు, పూల
జల్లులతో ఆళ్ల నానికి గడప గడపలో జనం నీరాజనాలు పలికారు. గులాబీ పూలను అందిస్తూ
చిన్నారులు పలికిన ఆత్మీయ స్వాగతం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆళ్ల నాని
చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
అనంతరం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద
ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో
మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు. ప్రతి నెలా వాలంటీర్ వచ్చి ఫించన్
అందిస్తున్నాడా అవ్వా?.. అమ్మ ఓడి వచ్చిందా తల్లి?..రైతు భరోసా అందిందా
తాతా?..అంటూ ప్రతి ఒక్కరినీ ఆళ్ల నాని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పధకాల
అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు సంక్షేమ పథకాల అమలు ఎంతో
బాగుందని, రాబోయే రోజుల్లో జగనన్న కు తామంతా అండగా ఉంటామని, వైఎస్ జగన్మోహన్
రెడ్డి తమ జీవితాల్లో కొండంత అండ లభించిందని గడప గడపలో లబ్ధిదారులు హర్షం
వ్యక్తం చేశారు.