కాకినాడ : ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు -పవన్‌కల్యాణ్ కలిశారని
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘అజెండా లేని వ్యక్తి పవన్. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడుతో చంద్రబాబు
కలుస్తున్నారు. పవన్‌కల్యాణ్ అజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడం
కోసమే. జనసేనకి బీజేపీ తో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుంది. చంద్రబాబును
గెలిపించడం కోసమే పవన్ పని చేస్తారు. దమ్ముంటే 175 స్థానాల్లో పవన్ పోటీ
చేయాలి. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్థం అవుతుంది. పవన్‌ను సీఎం
అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించగలరా?. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని
చంపితే దానిపై పవన్ కల్యాణ్ సానుభూతి చూపించాలని మంత్రి వ్యాఖ్యానించారు.